హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణపతి పూజలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

WGL: హన్మకొండ స్నేహానగర్‌ హరిహర అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని గణపతికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.