గద్వాల 12వ వార్డుకు చెందిన జ్యోతి–నాగరాజు కుమారుడు నరేంద్రర్ మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబీబీఎస్ సీటు సాధించారు. శుక్రవారం మాజీ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయనను శాలువాతో సత్కరించి, మిఠాయిలు తినిపించి అభినందించారు. ఉన్నత చదువులు పూర్తిచేసి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి సత్కారం


