BHPL: మల్హర్‌రావు మండలంలో చేయూత పింఛన్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో కె.క్రాంతికుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా 496 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామ పంచాయతీలకు అధికారులను కేటాయించి, దరఖాస్తుదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మల్హర్‌రావులో చేయూత పింఛన్ల పరిశీలన


