హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ సేవించిన ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. గోవా నుంచి డ్రగ్స్ సేవించి వచ్చిన ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజికుష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆశిష్ రెడ్డి, కుందన్‌రావు, డ్రైవర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.