హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైరా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా

KMM: ఈ నెల 19న జరగాల్సిన వైరా పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. ఛైర్‌పర్సన్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో అధికారులకు శిక్షణ ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.