NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ విద్యానగర్‌లో ఆవాసాలపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీలో కోరారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన, ఈ సమస్యను ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజలకు ముప్పుగా మారిన ఈ తీగలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: హై టెన్షన్ విద్యుత్ తీగలను తొలగించాలి: ఎమ్మెల్యే


