హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

జగిత్యాల పట్టణం 8వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో కౌన్సిలర్ హరీష్ అధ్యక్షతన పోషణ మాసం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యమన్నారు. సూపర్వైజర్ కవితా రాణి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భిణులకు సీమంతం, పోషణ మాసం ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.