హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు న్యాయం చేస్తాం: బక్కి వెంకటయ్య

GDWL: గద్వాల మండలం రేపల్లెలో కులాంతర వివాహం వివాదంలో జేసీబీతో కూల్చివేసిన ఇంటిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ధ్వంసమైన ఇంటిని పరిశీలించి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై బాధితులకు పూర్తి అండగా నిలిచి, న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా కల్పించారు.