హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 20న మంచిర్యాలలో 5కే, 10కే రన్

MNCL: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఫిట్ ఇండియాలో భాగంగా సేవా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20న ఉదయం 6 గంటలకు మంచిర్యాలలో 5కే, 10కే రన్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇందులో పాల్గొనే వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.