హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు: ఎక్సైజ్ సీఐ

MDK: వినాయక చవితి వేడుకల వేళ గణేష్ మండపాలు, విగ్రహాల షెడ్ల వద్ద అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదని రామాయంపేట ఎక్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో లేదా మండపాల వద్ద మద్యం సేవిస్తూ కనిపిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామన్నారు. యువత పరిమితులు దాటకుండా, పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.