MHBD: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఎస్పీ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో తొర్రూరు డివిజన్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశాల్లో భద్రత, బారికేడ్లు, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. గణేశ్ ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మండపాల నిర్వాహకులపై నిఘా ఉంచి, కార్యకలాపాలను పరిశీలిస్తామని తెలిపారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనం నిర్వహణకు ఏర్పాట్లు


