హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

KMR: కామారెడ్డి ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల సస్పెండ్‌కు గురై ఇంటి వద్ద ఉంటున్న సాయిలు మనోవేదనకు గురై కామారెడ్డిలోని తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధుమిత్రులు శుక్రవారం తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.