హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కంకర తేలి అద్వానంగా మారిన కప్పర్ల రోడ్డు

ADB: తాంసి మండలంలోని కప్పర్ల నుంచి పోచ్చెర గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు మార్గం పూర్తిగా కంకర తేలి ఉండటంతో జారిపడి ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గుంతలలో నీరు నుండి రాత్రివేళలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని కోరుతున్నారు.