హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనసేన బలాన్ని వివరించిన వార్డు అధ్యక్షుడు

VSP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో 88వ వార్డు జనసేన అధ్యక్షుడు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ శుక్రవారం పాల్గొన్నారు. 88వ వార్డులో పార్టీ బలం, ప్రజల్లో ఉన్న ఆదరణను కమిటీ సభ్యులకు వివరించారు. వార్డు పునర్విభజనలో 113వ వార్డుగా మారిందని తెలిపారు. పవన్ కళ్యాణ్, పంచకర్ల రమేష్ బాబు నాయకత్వంలో పార్టీ మరింత బలపడిందన్నారు.