GDWL: కేటీదొడ్డి మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు నాణ్యతలేని, పాడైపోయిన గుడ్లను పంపిణీ చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలకోసారి ఇవ్వాల్సిన గుడ్లను దాదాపు 50 రోజులకు ఇస్తూ, ఇలాంటి పాడైన గుడ్లు ఇస్తే చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. కుళ్లిన గుడ్ల దృశ్యాలు శుక్రవారం మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలంగాణ
అంగన్‌వాడీలో కుళ్లిన గుడ్ల పంపిణీ


