హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ సర్పంచ్ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే

NLG: చందంపేట మాజీ సర్పంచ్ గోసుల రాములు మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఇవాళ చందంపేటలో గోసుల రాములు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాములు మృతి కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.