KDP: బి.మఠానికి చెందిన లక్ష్మీదేవి తనకు చెందిన 10 సెంట్ల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను డబ్బులు చెల్లించి స్థలాన్ని కొనుగోలు చేశానని, ప్రస్తుతం కొందరు వ్యక్తులు ఆ స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై MRO కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయం కోసం మహిళ ఆవేదన


