హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగంలో సిమెంట్ లారీ బీభత్సం

NLR: ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ సంగం వద్ద బీభత్సం సృష్టించింది. స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపు తప్పి ఓ కారు, బొలేరోను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ట్యాంకర్ను ఆపకుండా వేగంగా పరారయ్యాడు. ఈ ఘటనలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులకు ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.