SRCL: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కొనరావుపేట మండలం సుద్దాలకు చెందిన చిన్నారి బ్లెస్సి గురువారం వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. బద్దెనపల్లి గురుకుల పాఠశాల 7వ తరగతి విద్యార్థిని, ప్రకృతి ప్రేమికురాలు బ్లెస్సి 2 వేల విత్తన బంతులతో మోదీ చిత్రపటాన్ని రూపొందించింది. ప్రకృతి ప్రకాష్ కూతురైన ఆమె పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో పలు అవార్డులు అందుకుంది.
తెలంగాణ
ప్రధానికి విత్తనబంతులతో శుభాకాంక్షలు..!


