MLG: జాకారం గ్రామ పంచాయతీ కార్మికుడు ఓరుగంటి రామస్వామిని సర్పంచ్ సొంత పొలం పనులకు తీసుకెళ్లగా పాము కాటుకు గురైన ఘటనపై డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కలువల రవీందర్ స్పందించారు. బాధితుడికి పూర్తి వైద్యం, నష్టపరిహారం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తే ఆందోళనలు చేపడతామన్నారు.
తెలంగాణ
పంచాయతీ కార్మికుడి వినియోగంపై డీవైఎఫ్‌ఐ నిరసన


