హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్‌లోకి వరద ప్రవాహం

KMR: నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇవాళ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రాజెక్టు నీటిమట్టం 1,400.25 అడుగులు, నీటి నిల్వ 11.622 టీఎంసీలుగా ఉందని ఏఈఈ సాకేత్‌ తెలిపారు. గత 24 గంటల్లో సగటున 2,945 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అవుట్‌ఫ్లో 181 క్యూసెక్కులుగా ఉందని, నీటి నష్టం ఆవిరి రూపంలోనే జరుగుతోందని అధికారులు తెలిపారు.