హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాస్టర్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు'

విశాఖపట్నంలో మాస్టర్ ఆఫ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ఈనెల 20న ఉదయం 7 నుంచి 11 గంటల వరకు జిల్లా స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు కార్యదర్శి కె.లతాదాస్ తెలిపారు. 30 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులు ఈ పోటీలకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.