హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్

AP: కాకినాడ జిల్లా తునిలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీతారాంపురంలో తనిఖీలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.62.50 లక్షల విలువైన 125 కేజీల గంజాయి, రూ.3.41 లక్షల నగదుతో పాటు కారు, ఆటో, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.