హైదరాబాద్: 28°C
క్రైమ్

యాసిడ్‌తో దాడి చేసి కత్తితో పొడిచిన భర్త

బెంగళూరు జేపీ నగర్‌లో దారుణం జరిగింది. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భార్యపై భర్త నడి రోడ్డుపై యాసిడ్‌తో దాడి చేసి, కత్తితో పొడిచి హత్యాప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ నిందితుడిని అదుపులోకి తీసుకుని, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది.