కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు, పురపాలక సంస్థ, జిల్లా పంచాయతీ, పాఠశాల విద్య, తదితర శాఖల అధికారులు, పురపాలక కమిషనర్లు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని, స్వచ్ఛత సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛతా హి సేవా'పై అధికారులతో కలెక్టర్ సమీక్ష


