హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన'

W.G: ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. బుధవారం నరసాపురం 22వ వార్డులో రూ. 5 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నరసాపురం పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.