హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయం ఎందుకు అసంపూర్తి..?

ASR: సుంకరమెట్ట గ్రామ సచివాలయ భవనం స్లాబ్ దశలోనే నిలిచిపోవడంపై ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రశ్నించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో భవనం పిచ్చిమొక్కలతో శిథిలావస్థకు చేరిందన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా భవనాలు పూర్తికాలేదని, నిధులు తిరిగి జమ కాలేదన్నారు. వెంటనే భవనాన్ని పూర్తిచేయాలని, లేకుంటే నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.