శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెరుగైన సేవలు అందించడంలో అధికారులు మరింత జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి'


