NTR: చందర్లపాడు (M) కొనయపాలెంలో బుధవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. ఇటీవల మరణించిన టీడీపీ నేతల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ మేరకు మాజీ వైస్ ప్రెసిడెంట్ వనపర్తి వెంకటేశ్వర్లు, తొర్లికొండ పద్మావతి, కళ్యాణపు నాగేశ్వరరావు, మొండితోక మరియమ్మ, జువ్వ విల్సన్ రావు, ఉలవలపుడి నాగేంద్రమ్మ, నవీన్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
చందర్లపాడులో పర్యటించిన ఎమ్మెల్యే తంగిరాల


