హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంట కోత ప్రయోగంపై అవగాహన'

KDP: సిద్ధవటం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు పంట కోత ప్రయోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సహాయ గణాంక అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని రైతులు సాగు చేసిన వరి పంట దిగుబడి అంచనాపై సర్వే నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రమేష్‌రెడ్డి, ఏఈఓ ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.