హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

100% పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం: జేసీ

ELR: ఏలూరు జిల్లాలో సెప్టెంబర్ నెలకు లక్ష్యంగా పెట్టుకున్న 13,154 పట్టాదార్ పాస్ పుస్తకాల్లో 100% పంపిణీ చేసినట్లు జేసీ అభిషేక్ గౌడ తెలిపారు. బుధవారం సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి నిర్వహించిన జూమ్‌ సమావేశంలో జిల్లా పురోగతిని వివరించారు. 22ఏ భూ సమస్యలపై 446 దరఖాస్తులు రాగా 210 పరిష్కరించి, 193 తిరస్కరించినట్లు తెలిపారు.