హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏల్చూరిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని దర్గా సెంటర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై స్థానికులకు బురద ఇబ్బందులు తొలగాయి. వర్షం పడిన ప్రతిసారీ ఇక్కడి సిమెంటు రోడ్డుపైకి భారీగా మట్టి కొట్టుకువచ్చి పేరుకుపోతోంది. దీంతో రోడ్డు మొత్తం బురదమయంగా మారి స్థానికులు రాకపోకలు సాగించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బుధవారం ఆ సమస్యకు పరిష్కారం లభించింది.