హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

SKLM: ఆమదాలవలస పట్టణంలోని పలు దుకాణాల్లో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపల్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమిషనర్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 25 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులపై రూ.21,650 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.