బాపట్ల(M) ఆసోదివారిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా వైద్యాధికారి విజయమ్మ బుధవారం తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్ల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లులకు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. తదుపరి టీకాలకు పిల్లలను క్రమం తప్పకుండా ఆరోగ్య కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తనిఖీ


