హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాకు తుది ముహూర్తం

అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం నగరపాలక సంస్థతో పాటు రాయదుర్గం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర తెలిపారు.