హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలు, యువతకే ప్రాధాన్యం'

VSP: గాజువాకలో నిర్వహించిన కూటమి నేతల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. టికెట్లు ఎవరికి వచ్చినా అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. మహిళలు, యువతకు ఎక్కువ ప్రాధాన్యంతో టికెట్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు.