హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాడ్జిలో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

VSP: కూర్మన్నపాలెంలోని ఓ లాడ్జిలో క్యాబ్ డ్రైవర్ లంక ఈశ్వరరావు (40) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజీవ్ నగర్‌కు చెందిన ఆయన మంగళవారం రాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు ఎస్సై నేతాజీ తెలిపారు.