హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో శాశ్వత ఉద్యోగాలు ఉండవు: CBN

TPT: తిరుమలలో ఇక కొత్త నిర్మాణాలు చేపట్టబోమని సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైన మేరకే ఉద్యోగాలు ఉంటాయని, శాశ్వత ఉద్యోగాలు ఉండవని స్పష్టం చేశారు. శ్రీవారి వద్ద ఉద్యోగంగా కాకుండా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సేవలందించేలా శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. కొండపై పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.