హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై సమావేశం

TPT: సూళ్లూరుపేట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ఏర్పాటు చేయనున్న 32 పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కేంద్రాల ఏర్పాటుపై సూచనలు, అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. మన్నెముత్తేరి పంచాయతీలోని 22, 23వ పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు.