ASR: చింతపల్లిలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్సై జి. వీరబాబు ఆధ్వర్యంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. పాత బస్‌స్టాప్ వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలను తనిఖీ చేసి ఆర్‌సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. హెల్మెట్ లేకుండా, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానాలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లిలో విస్తృత వాహన తనిఖీలు


