హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాగునీటి పైపుల్లో మురుగునీరు..!

SKLM: మెళియాపుట్టి మండలం మర్రిపాడు-సి పంచాయతీ జలక లింగుపురం ఆంజనేయ గుడి వీధిలో కుళాయిల నుంచి మురుగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలోనే తాగునీటి పైపులు వేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.