హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గొర్రెలకు బీమా చేయించండి'

SKLM: గొర్రెలు, మేకలకు కేవలం రూ.27తో ఏడాది పాటు బీమా చేయించుకోవచ్చని పాతపట్నం మండలం కొరసవాడ పశువైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌ బుధవారం తెలిపారు. బీమా ప్రీమియంలో 85 శాతం ప్రభుత్వమే భరిస్తుందని, ఒకవేళ బీమా చేసిన జీవం మృతి చెందితే రూ.6 వేల పరిహారం అందుతుందని పేర్కొన్నారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.