హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొడుగులతో ఓజోన్ పరిరక్షణపై అవగాహన

W.G: అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తేతలి జడ్పీ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని గొడుగులా కాపాడుతుందని ఉపాధ్యాయులు వివరించారు. చెట్లను పెంచడం ద్వారా ఓజోన్ పొరను రక్షించుకోవచ్చన్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకుని ఓజోన్ పరిరక్షణ నినాదాలు చేశారు