హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న అన్నా

ప్రకాశం: మార్కాపురం పట్టణం మెయిన్ బజార్‌లోని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం మార్కాపురం వైసీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.