SKLM: జలుమూరు మండలం తిలారు గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన బుధవారం ప్రారంభించారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే రమణమూర్తి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం'


