హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి'

ATP: కళ్యాణదుర్గం మండలంలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. సాగునీరు అందక దానిమ్మ, చీని తోటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బిటిపి కాలువల నిర్వహణలో MLA సురేంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎండిన తోటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.