కృష్ణా: గుడివాడలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి దేవస్థానంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఉదయం సత్య తులసి దుర్గాంబ బృందం భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 30 మంది సభ్యులతో ఘనంగా కోలాట ప్రదర్శన చేపట్టారు. ఆధ్యాత్మిక గీతాలకు అనుగుణంగా కోలాటం ఆడుతూ భక్తులను అలరించారు. భక్తిశ్రద్ధలతో సాగిన కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చవితి వేడుకల్లో మహిళల కోలాట ప్రదర్శన


