NLR: మనుబోలులోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో జలజాక్షి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు. సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మనుబోలులో 11 ఎంపీటీసీలకు ఎన్నికలు


