అన్నమయ్య: సుండుపల్లి మండల టీడీపీ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని తీర్మానించారు. వర్షాభావ పరిస్థితుల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సమావేశంలో పలు తీర్మానాలు


