కోనసీమ: ఆలమూరు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఏ. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండల పరిధిలోని పలు అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. సమావేశానికి మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన మండల, గ్రామస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 18న సర్వసభ్య సమావేశం


